logo

ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేస్తాం

ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ప్రజలు ఆరోగ్యంతో పాటు రాగులు, జొన్నలు పండించే రైతులను ప్రోత్సహించి పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 05:09 IST

రాష్ట్ర పౌరసఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

కార్డుదారులకు రాగులు పంపిణీ చేస్తున్న కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, కలెక్టర్‌ గౌతమి, ఎమ్మెల్యే అనంత, తదితరులు

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ప్రజలు ఆరోగ్యంతో పాటు రాగులు, జొన్నలు పండించే రైతులను ప్రోత్సహించి పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం అనంత నగరంలోని రాజేంద్ర మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో కలెక్టర్‌ గౌతమి, సంయుక్త కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిలతో కలిసి ఎంయూడీల ద్వారా ఈనెల నుంచి కార్డుదారులకు రాగుల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్‌ ప్రారంభించారు. కమిషనర్‌ మాట్లాడుతూ గతంలో బియ్యం మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం పంచదార, కందిపప్పుతోపాటు రాగులు, జొన్నలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కార్డుదారులకు గరిష్ఠంగా మూడు కిలోల వరకు పంపిణీ చేస్తామని, భవిష్యత్తులో 5-10 కిలోల రాగులు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ గౌతమి, డీఎస్‌వో శోభారాణి, డీఎం నీలమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని