logo

జయమంగళిని కొల్లగొడుతున్నారు

జయమంగళి నదిలో అనుమతులు ఇవ్వని సర్వే నంబర్లలో కాంట్రాక్టు సంస్థ ప్రవేశించి అడ్డుగోలుగా ఇసుకను తోడేస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రీచ్‌ నుంచి ఇసుక తరలించాలనే నిబంధన ఉన్నా.. 24 గంటల పాటు నిరంతరాయంగా తరలిస్తున్నారు.

Published : 02 Jun 2023 05:09 IST

కాలువపల్లి శివాలయం వద్ద భారీగా ఇసుక నిల్వలు

పరిగి, న్యూస్‌టుడే: జయమంగళి నదిలో అనుమతులు ఇవ్వని సర్వే నంబర్లలో కాంట్రాక్టు సంస్థ ప్రవేశించి అడ్డుగోలుగా ఇసుకను తోడేస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రీచ్‌ నుంచి ఇసుక తరలించాలనే నిబంధన ఉన్నా.. 24 గంటల పాటు నిరంతరాయంగా తరలిస్తున్నారు. జూన్‌, జులైలో వర్షాలు వస్తే నది నుంచి తరలించలేమని భావించి కాలువపల్లి శివాలయం సమీపంలో ప్రైవేటు భూమిని లీజుకు తీసుకుని అక్కడికి తరలించి నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో బెంగళూరుకు తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు స్థలంలో 1000కి పైబడి టిప్పర్ల ఇసుక నిల్వ చేశారు. దీని విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. గత రెండు నెలలుగా రీచ్‌ నుంచి కోట్లాది రూపాయల విలువగల ఇసుక తరలిపోయింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో హిందూపురం సెబ్‌ సీఐ స్వర్ణలత, ఇతర అధికారులు గురువారం కాలువపల్లి శివాలయం వద్ద ఇసుక నిల్వలను పరిశీలించారు. అక్కడకు చేరుకున్న సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు సెబ్‌ అధికారుల తీరును తప్పుపడుతూ వాగ్వాదానికి దిగారు. నాడు-నేడు కింద చేపట్టే పనుల కోసం ఇసుకను డంప్‌ చేసినట్లు ఆమె చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే తమ పార్టీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని