భానుడు భగభగ.. ఆరోగ్యానికి సెగ!
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండలు మండుతున్న నేపథ్యంలో సమతుల్యమైన జీవనశైలితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం నుంచి ఆహారం వరకు అన్నిట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
వ్యాయామం: వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు బయట ఉష్ణోగ్రతలు కారణంగా చెమట రూపంలో లవణాలు బయటకు పోతాయి. ఈ నేపథ్యంలో సూర్యోదయంలోపే 45 నిమిషాలకు మించకుండా, మంచి శిక్షకుడి ఆధ్వర్యంలో వ్యాయామం పూర్తి చేయాలి.
నీళ్లు: ఎక్కువ శాతం నీటిని తాగడం వల్ల ప్రయోజనం తక్కువే. అలా కాకుండా కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకోవడం వల్ల చెమట రూపంలో పోయిన లవణాలు శరీరానికి తిరిగి అందుతాయి. ఎండలో పనిచేసే వారికి ఇవి మరింత అవసరం.
ఆహారం: అతిగా మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. కూరగాయలతోపాటు మసాలాలు లేకుండా ఉడికించిన చేపలు, చికెన్ లాంటివి తీసుకోవచ్చు.
ఆటలు: పిల్లలు, పెద్దలు ఎండలో ఆటలు ఆడకపోవడమే మేలు. దీనివల్ల తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతారు. సాయంత్రం వేళ వాతావరణం చల్లబడిన తర్వాతే పిల్లలను ఆటలకు పంపాలి. ఈత, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మేలు.
ఏసీలు, కూలర్లు: ఏసీల్లో ఎక్కువ సమయం గడపటం వల్ల డ్రైఐస్ లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చల్లదనం వల్ల కొందరు నీళ్లు సక్రమంగా తీసుకోరు. ఫలితంగా యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుంది. ఏసీల్లో ఫిల్టర్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కూలర్లలో దుమ్ము పట్టకుండా చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
2000 Note: 2000 నోట్ల మార్పిడికి ముగుస్తున్న డెడ్‌లైన్.. తర్వాత ఏంటి?
-
TDP: సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్ ఫిర్యాదు
-
Cricket News: అత్యాచార ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడిన శ్రీలంక క్రికెటర్
-
Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం