logo

గొంతు తడవాలంటే.. నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సిందే!

విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. గొంతు తడుపుకొనేందుకు ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.

Published : 03 Jun 2023 03:14 IST

సంపులో నీటి కోసం పాట్లు

విడపనకల్లు, ఉరవకొండ, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. గొంతు తడుపుకొనేందుకు ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో 330 వరకు గృహాలు ఉండగా, 1,500 వరకు జనాభా నివాసం ఉంటున్నారు. గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విడపనకల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుల నుంచి నీరు సరఫరా అవుతాయి. ఐదారు రోజులుగా విద్యుత్తు సమస్యతో పాటు సరఫరాలో అలసత్వం కారణంగా సరఫరా స్తంభించింది. గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. చేసేదిలేక ప్రజలు విడపనకల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లోకి దిగి నీరు తెచ్చుకుంటున్నారు. బిందె మోసుకొని గట్టు ఎక్కే సమయంలో తడబడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ట్యాంకులోకి దిగలేని వారు సంపుల్లో నీటిని ముంచుకొంటున్నారు. చాలా మంది ఆటోలు, ఎడ్లబండ్లు, ద్విచక్ర వాహనాల్లో డ్రమ్ములు, బిందెలు తీసుకెళ్లి ఎన్నో అవస్థలు పడుతూ నీటిని తెచ్చుకుంటున్నారు. నీళ్ల కోసం పనులు వదులుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

విడపనకల్లు వద్ద ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి దిగి బిందెలతో నీటిని తెచ్చుకుంటున్న మాళాపురం గ్రామస్థులు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు