కేఎస్‌ఎన్ కళాశాలకు స్వయంప్రతిపత్తి
అనంత నగరంలోని కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు స్వయంప్రతిపత్తి (అటానమస్) హోదా దక్కింది. యూజీసీ కార్యదర్శి అజయ్‌కుమార్‌జోషి, ఉప కార్యదర్శి గోపీచంద్ మీరుగు గత నెల 31న ఎస్కేయూ రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు పంపారు.
కేఎస్‌ఎన్ కళాశాల
ఎస్కేయూ, న్యూస్‌టుడే: అనంత నగరంలోని కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు స్వయంప్రతిపత్తి (అటానమస్) హోదా దక్కింది. యూజీసీ కార్యదర్శి అజయ్‌కుమార్‌జోషి, ఉప కార్యదర్శి గోపీచంద్ మీరుగు గత నెల 31న ఎస్కేయూ రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు పంపారు. కళాశాల ప్రిన్సిపల్ శుక్రవారం లేఖ అందుకున్నారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి 2033-34 వరకూ స్వయంప్రతిపత్తి హోదా కల్పించారు. గతంలో ఆరేళ్లు మాత్రమే అటానమస్ కల్పించేవారు. కేఎస్‌ఎన్ కళాశాలకు 10 సంవత్సరాలు అటానమస్ హోదా దక్కింది.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అందులో రెండు మహిళా డిగ్రీ కళాశాలలున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలకు గతేడాది యూజీసీ అనుబంధ సంస్థ నాక్ బృందం కళాశాలలో పర్యటించింది. ఉన్నత ప్రమాణాలు, మెరుగైన బోధన, చక్కటి వసతులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, విద్యార్థినుల భాగస్వామ్యం తదితర అంశాలను పరిశీలించారు. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నందుకు నాక్- ఏ గ్రేడ్ గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు స్వయంప్రతిపత్తి కల్పించడం విశేషం.
అంచెలంచెలుగా ఎదుగుతూ..
కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల 1984లో ఏర్పడింది. తొలుత మొదటి రోడ్డులోని శారదానగర్ పాఠశాల ఆవరణలో కళాశాల నిర్వహించారు. ఆ తరువాత కేఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలోకి మార్చారు. 2011 నుంచి భైరవనగర్‌లోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో ఉన్న సొంత భవనంలో నిర్వహిస్తున్నారు. 2007లో న్యాక్ సీ ప్లస్‌ప్లస్, 2014లో బీ-గ్రేడ్ వచ్చింది. 2022లో ఏ-గ్రేడ్ దక్కింది. 2023లో స్వయంప్రతిపత్తి హోదా కల్పించారు. కళాశాలలో ప్రస్తుతం 1,386 మంది విద్యార్థినులు, 42 మంది అధ్యాపకులు ఉన్నారు. యూజీలో 13 కోర్సులు, పీజీలో 7 కోర్సులు నిర్వహిస్తున్నారు. 4 కంప్యూటర్ ల్యాబ్‌లు, 3 వర్చువల్, 3 డిజిటల్ తరగతి గదులున్నాయి. అన్ని గదుల్లో ఐటీసీ (అంతర్జాల తరగతులు) సదుపాయం ఉంది. రసాయన, భౌతిక, వృక్ష, జంతుశాస్త్రాలకు సంబంధించిన ప్రయోగశాలలు ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, క్రీడల్లో కూడా విద్యార్థినులు ప్రతిభ చాటుతున్నారు. మహిళలకు ప్రత్యేక వసతిగృహం, వ్యాయామశాల, ఆరోగ్యకేంద్రాలు ఈ కళాశాల ఆవరణలో ఉన్నాయి. స్వయంప్రతిపత్తి కళాశాలకు యూజీసీ నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరవుతాయి. ఈ నిధులతో కళాశాల మరింత అభివృద్ధి చెందుతుంది.
కొత్త కోర్సులకు అవకాశం
స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోర్సులు నిర్వహించుకోవచ్చు. స్వయంగా సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం అన్నీ కళాశాలలోనే జరుపుతారు.
అటామస్ ఉత్తర్వులు ప్రదర్శిస్తున్న ప్రిన్సిపల్, అధ్యాపకులు
నాలుగేళ్ల కృషికి ఫలితం
నాలుగేళ్ల కృషి ఫలితంగా కళాశాలకు స్వయంప్రతిపత్తి దక్కింది. న్యాక్ గుర్తింపు కోసం రెండున్నరేళ్ల పాటు శ్రమించాం. కళాశాలలో వసతులు మెరుగుపరచడం, ప్రయోగశాలలను అభివృద్ధి చేశాం. బోధన, బోధనేతర సిబ్బంది ఎంతో శ్రమించారు. రాబోయే రోజుల్లో కళాశాల అంతా ఏసీ ఉండాలని, 2 వేల మందికిపైగా విద్యార్థినులకు బోధన అందించడానికి కృషి చేస్తాం.
శంకరయ్య, ప్రిన్సిపల్, కేఎస్‌ఎన్ కళాశాల
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mahindra Cars: అందులో మా తప్పేం లేదు.. ఎయిర్‌బ్యాగ్‌ల కేసుపై మహీంద్రా వివరణ
-
ఈ-మెయిల్ చూడని వైనం.. ‘బెయిల్’ వచ్చినా 3 ఏళ్లు జైల్లోనే!
-
Nijjar killing: నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్ఐ..!
-
S Jaishankar: అసాధారణ స్థితిలో భారత్- చైనా బంధం: జై శంకర్
-
Assam: మైనర్ బాలికకు నరకం.. ఆర్మీ అధికారి దంపతుల దాష్టీకం
-
TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు సబబే: హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు