logo

కోటిలింగేశ్వర ఆలయ భూమిని కాపాడతాం: తెదేపా

దేవుని ఆస్తులు రక్షించాల్సిన ఎమ్మెల్యే శంకరనారాయణపై భక్షకుడిగా మారారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మండిపడ్డారు.

Published : 03 Jun 2023 03:14 IST

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, నాయకులు

గోరంట్ల, న్యూస్‌టుడే: దేవుని ఆస్తులు రక్షించాల్సిన ఎమ్మెల్యే శంకరనారాయణపై భక్షకుడిగా మారారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మండిపడ్డారు. మండలంలోని బూదిలి పంచాయతీ పరిధిలో కోటిలింగేశ్వర ఆలయానికి చెందిన 4.09 ఎకరాల పొలాన్ని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసే ప్రయత్నాన్ని బీకే తీవ్రంగా ఖండించారు. ఆ గ్రామ సమీపంలో ఉన్న పొలాన్ని స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించిన అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తంచేశారు. తహసీల్దార్‌ రంగనాయకులు అక్కడకు వచ్చి చర్చించారు. సర్వే నంబరు 532లో ఉన్న రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాల రద్దుకు ఆదేశించామని, ఆర్డీవో ఆధ్వర్యంలో నెలలోపు సమస్య పరిష్కారమౌతుందని తహసీల్దార్‌ సమాధానం ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీరశైవులకు అండగా ఉంటామని, ఆలయ భూమిని కాపాడే బాధ్యత తెదేపాదేనని పేర్కొన్నారు. పార్టీ మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, నాయకులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు