logo

ఎట్టకేలకు తాగునీటి సరఫరా

విడపనకల్లు మండలం మాళాపురం గ్రామానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

Published : 04 Jun 2023 06:08 IST

కుళాయి నీటిని పట్టుకుంటున్న స్థానికులు, పర్యవేక్షిస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ ధనుంజయ

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండలం మాళాపురం గ్రామానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆ గ్రామంలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులు, స్థానికులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని విడపనకల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి నీటిని తెచ్చుకుంటున్న వైనంపై శనివారం ‘ఈనాడు’లో ‘గొంతు తడవాలంటే.. నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సిందే!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు స్పందించారు. ఏఈఈ ధనుంజయ ఉదయాన్నే దగ్గరుండి, గ్రామానికి నీటి సరఫరాను చేయించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని