logo

అర్హులైన రైతులందరికీ సంక్షేమ ఫలాలు

జిల్లాలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా నూతన వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి ఆమె జిల్లాకు వచ్చారు.

Published : 04 Jun 2023 06:08 IST

నూతన డీఏవో ఉమామహేశ్వరమ్మకు పుష్పగుచ్ఛం అందిస్తున్న చంద్రనాయక్‌

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా నూతన వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి ఆమె జిల్లాకు వచ్చారు. శనివారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో డీఏవో చంద్రనాయక్‌ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. అనంతరం బాధ్యతలు అప్పగించారు. దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాకు కొత్తే.. అయినా పక్కనున్న కర్నూలు జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశా. జిల్లాపై కొంత పట్టుంది. అధికారులు, సిబ్బందితో కలిసికట్టుగా పనిచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాయుశక్తులా కృషి చేస్తామని వివరించారు. అనంతరం డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు, కార్యాలయ సిబ్బంది నూతన డీఏవోకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.


సైకిల్‌ తొక్కడంతో ఆరోగ్యం

ఎస్కేయూ ఆవరణలో సైకిల్‌ తొక్కుతున్న రెక్టార్‌ మల్లికార్జునరెడ్డి, తదితరులు

ఎస్కేయూ: సైకిల్‌ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఎస్కేయూ రెక్టార్‌ ఆచార్య మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ బైస్కిల్‌ దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌వైకే ఆధ్వర్యంలో సైకిల్‌డే ర్యాలీ శనివారం నిర్వహించారు. నెహ్రూ యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ సోమశేఖర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి రామిరెడ్డి, యువకేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు