logo

ఆసుపత్రి ఆవరణలో అవస్థలు

సర్వజనాసుత్రిలో రోగుల బంధువులకు ఆరుబయట పడిగాపులు తప్పటం లేదు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల కోసం వచ్చే బంధువులకు అక్కడ అనుమతి లేకపోవటంతో ఆరుబయట చెట్ల కింద ఉంటున్నారు.

Published : 04 Jun 2023 06:08 IST

సర్వజనాసుత్రిలో రోగుల బంధువులకు ఆరుబయట పడిగాపులు తప్పటం లేదు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల కోసం వచ్చే బంధువులకు అక్కడ అనుమతి లేకపోవటంతో ఆరుబయట చెట్ల కింద ఉంటున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వీరికి ఆరుబయట ఇబ్బంది తప్పటం లేదు. తమతో పాటు వచ్చిన చిన్నారులను నిద్రపుచ్చేందుకు చెట్లకు ఊయలలు కట్టుకుంటున్నారు. ఇక తమతోపాటు తెచ్చుకున్న ఇతర సామగ్రితో చెట్ల కిందే కాలక్షేపం చేస్తున్నారు. రోగి సహాయకులు, బంధువుల కోసం అవసరమైన షెడ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
- చిత్రాలు: ఈనాడు, అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని