logo

డీటీసీ సేవలు అభినందనీయం

అనంతపురం జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీసీ) శివరామప్రసాద్‌ సేవలు అభినందనీయమని పలువురు అధికారులు పేర్కొన్నారు.

Updated : 04 Jun 2023 06:32 IST

శివరామప్రసాద్‌ను సన్మానిస్తున్న శ్రీసత్యసాయి  డీటీవో కరుణసాగర్‌రెడ్డి, అనంతపురం ఆర్‌టీవో సురేష్‌నాయుడు

లక్ష్మీనగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీసీ) శివరామప్రసాద్‌ సేవలు అభినందనీయమని పలువురు అధికారులు పేర్కొన్నారు. శివరామప్రసాద్‌ శ్రీకాకుళం డీటీసీగా బదిలీ అయిన సందర్భంగా శనివారం అనంతపురంలోని రవాణాశాఖ కార్యాలయంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. డీటీసీని శ్రీసత్యసాయి జిల్లా డీటీవో కరుణసాగర్‌రెడ్డి, ఆర్‌టీవో సురేష్‌నాయుడు సన్మానించారు. మూడున్నరేళ్లపాటు జిల్లాలో సమర్థంగా పనిచేశారని గుర్తుచేశారు. అనంతరం శివరామప్రసాద్‌ మాట్లాడుతూ ఉద్యోగ ప్రస్థానంలో తనకు సహరించినవారందరీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాసులు, రమణారెడ్డి, సునీత, అతికానాజ్‌, ఏఎంవీఐలు శ్రీనివాసులు, రఘునాథ్‌, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

*అనకాపల్లి ఆర్‌టీవోగా పనిచేసున్న వీర్రాజుకు డీటీసీగా పదోన్నతి కల్పించి అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఈయన విధుల్లోకి చేరేంత వరకు అనంతపురంలో ఆర్‌టీవోగా పనిచేస్తున్న సురేష్‌నాయుడుకు ఇన్‌ఛార్జి డీటీసీగా బాధ్యతలు అప్పగించారు.


నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి


ప్రాసిక్యూషన్‌ గదులు పరిశీలిస్తున్న డైరెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: క్రిమినల్‌ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కృషి చేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా కోర్టులోని ప్రాసిక్యూషన్‌ భవనంలో పీపీలు, ఏపీపీలతో వివిధ కేసులపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఎన్ని కేసులు విచారణలో ఉన్నాయి, వాటి వివరాలను తెలుసుకున్నారు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులు వీగి పోకుండా గట్టిగా కృషి చేయాలన్నారు. సుదర్శన్‌రెడ్డిని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్‌ రామనాయక్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హరినాథరెడ్డి, ప్రత్యేక పీపీలు ఉమాపతి, విద్యాపతి, సృజన, లక్ష్మీనారాయణరెడ్డి, నాగరాజరావు, నారపరెడ్డి, ఏపీపీలు దుర్గాదేవి, సుచిత్ర, హేమలత, శ్రీనివాసులు, వసంత లక్ష్మి, నగేశ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని