logo

మూగబోయిన ‘ఏపీ పోలీస్‌ సేవా యాప్‌’

పోలీస్‌స్టేషన్‌ ద్వారా లభించే అన్ని సేవలను సులభతరంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘ఏపీ పోలీసు సేవా యాప్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా రూపొందించారు.

Published : 07 Jun 2023 05:16 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీస్‌స్టేషన్‌ ద్వారా లభించే అన్ని సేవలను సులభతరంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ‘ఏపీ పోలీసు సేవా యాప్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా రూపొందించారు. యాప్‌ ద్వారా ఫిర్యాదు , కేసుల పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు, రోడ్డు భద్రత, మహిళా భద్రత, లైసెన్సులు ఇతర వెరిఫికేషన్లు పొందవచ్చు. ఈ యాప్‌ నుంచే వాట్సాప్‌ ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా  రూపొందించారు. ఇదంతా ఒకప్పుడు. ఈ యాప్‌ నెల రోజుల నుంచి అసలు పనిచేయడం లేదు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ఆస్కారమే లేదు. దీంతో స్టేషన్‌కు వెళ్లకుండానే ఎఫ్‌ఐఆర్‌ కాపీలు పొందడానికి వీల్లేకుండా పోయింది. ప్రమాదాల్లో మృతి చెందిన వారికి బీమా కంపెనీలు, ప్రభుత్వాల నుంచి వచ్చే పరిహారాలకు ఎఫ్‌ఐఆర్‌ కాపీలు తప్పనిసరి కావడంతో అవి సకాలంలో స్టేషన్ల నుంచి అందడం లేదు. బాధితులు స్టేషన్ల నుంచి ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని