logo

పుంజుకున్న అనంత రైజింగ్‌ స్టార్స్‌ జట్టు

అనంత క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా రెండోరోజు మంగళవారం జరిగిన పోటీల్లో అనంత రైజింగ్‌ స్టార్స్‌ జట్టు శరవణ స్లగ్గర్స్‌ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Published : 07 Jun 2023 05:16 IST

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకుంటున్న కామిల్‌

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: అనంత క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా రెండోరోజు మంగళవారం జరిగిన పోటీల్లో అనంత రైజింగ్‌ స్టార్స్‌ జట్టు శరవణ స్లగ్గర్స్‌ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలిరోజు పోటీలో ఓడిన స్టార్స్‌ జట్టు రెండోరోజు అద్భుతంగా ఆడింది. అనంత క్రీడాగ్రామంలో ఉదయం జరిగిన పోటీలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రైజింగ్‌ స్టార్స్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఎస్‌.కామిల్‌ (45), లీలసాయి (41)లు బ్యాటింగ్‌లో కదం తొక్కడంతో భారీ స్కోరు లభించింది. శరవణ బౌలర్లు మల్లికార్జున (3 వికెట్లు), చంద్రశేఖర్‌, రాజు కుళ్లాయప్పలు చెరో రెండు వికెట్లు కూల్చారు. తర్వాత 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన శరవణ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. మణిదీప్‌ (39), ఖాదర్‌వలి (24) కాసేపు మెరిపించినా ఫలితాన్ని ప్రభావితం చేయలేకపోయారు.  బ్యాటింగ్‌లో రాణించిన కామిల్‌కు రూ.5 వేల విలువైన ఆరోగ్య కార్డును డాక్టర్‌ సుప్రజా చౌదరి అందజేశారు. మధ్యాహ్నం జరిగిన మరో పోటీలో స్పార్టన్స్‌ జట్టు కోగటం వారియర్స్‌ జట్టుపై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వారియర్స్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేయగా ప్రతిగా స్పార్టన్స్‌ జట్టు 19.4 ఓవర్లలో 156 పరుగులు చేసింది. రంజీ క్రికెటర్‌ గిరినాథ్‌రెడ్డి (57), వెంకట్‌లోకేష్‌ (24)లు బ్యాటింగ్‌లో మెరిపించి జట్టును గెలిపించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గిరినాథ్‌రెడ్డి అందుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని