logo

‘నాసిన్‌’ పరిధిలో స్వయం ఉపాధికి అవకాశాలు

గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నిర్మాణంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నాసిన్‌ కంపెనీ పరిధిలోని గ్రామాల ప్రజలకు స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌మల్హోత్ర పేర్కొన్నారు.

Published : 07 Jun 2023 05:16 IST

కలెక్టర్‌ అరుణ్‌బాబుకు సమస్యలు విన్నవిస్తున్న గ్రామస్థులు

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నిర్మాణంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నాసిన్‌ కంపెనీ పరిధిలోని గ్రామాల ప్రజలకు స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌మల్హోత్ర పేర్కొన్నారు. పాలసముద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మల తయారీలో పద్మశ్రీ  పురస్కార గ్రహీత చలపతిరావు, నాసిన్‌ ప్రతినిధులు వివేక్‌జోరీ, అశోక్‌శుక్లా, అరోరా, జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ప్రాంతప్రజల జీవన విధానంలో మార్చులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మొదటి విడతగా పైరెండు అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ముందుకొచ్చిన రైతులకు బెంగళూరు సమీపానికి తీసుకెళ్లి పెంపకంపై క్షేత్రస్థాయి పరిశీలన ఏర్పాటు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక్కడే తయారయ్యే ఉత్పత్తులు సంస్థ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న శ్మశానవాటిక, ఉన్నత పాఠశాల ప్రహరీ సమస్యలను సర్పంచి గంగప్ప, మాజీ సర్పంచి నరసింహులు  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఆర్డీవో భాగ్యరేఖ, తహసీల్దారు రంగనాయకులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీవో రఘునాథగుప్తా  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని