logo

ధర నిర్ణయించకుండా పరిహారం ఎలా జమ చేస్తారు?

జాతీయ రహదారి 342 నిర్మాణానికి జీవనాధారమైన భూములు కోల్పోయామని, అధికారులు గ్రామ సభలు నిర్వహించి, ధర నిర్ణయించకుండా.. ఖాతాల్లో అరకొరగా నగదు జమ చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 07 Jun 2023 05:16 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే : జాతీయ రహదారి 342 నిర్మాణానికి జీవనాధారమైన భూములు కోల్పోయామని, అధికారులు గ్రామ సభలు నిర్వహించి, ధర నిర్ణయించకుండా.. ఖాతాల్లో అరకొరగా నగదు జమ చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం చండ్రాయునిపల్లి, సిద్ధారాంపురం గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. రహదారి నిర్మాణానికి కోల్పోయిన భూములకు మార్కెట్‌ ధరలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండు చేశారు. భూములు కోల్పోయిన రైతులతో అధికారులు గ్రామసభలు నిర్వహించలేదని, నోటీసులు ఇవ్వలేదని, పరిహారం ఇంత అందిస్తామని, చెప్పకుండానే అడ్డగోలుగా అధికారులు పరిహారం జమ చేశారని వాపోయారు. రైతుల భూములకు సర్వే నం:590లో వ్యత్యాసంగా ఖాతాల్లో పరిహారం జమ చేశారని, అధికారుల తప్పిదాలు ఉన్నాయని, వెంటనే పరిశీలించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుత మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఎకరాకు రూ.25లక్షలు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండు చేశారు. ఏ రైతు భూమి ఎంత పోయింది.. అనే వివరాలు లేవు.. ఇళ్లకు, షెడ్లు, ఎంత పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించలేదన్నారు. అనంతరం ఆర్డీవో భాగ్యరేఖకు రైతులు వినతిపత్రం అందజేశారు. రైతులకు అన్యాయం జరగకుండా పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని