logo

పార్టీకోసం పనిచేసినా.. కనీసం ఇల్లు లేదు

మండల పరిధి శెట్టిపల్లి పంచాయతీ మారమ్మదిన్నలో మంగళవారం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరనారాయణను అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త పోతన్న ప్రశ్నించారు.

Published : 07 Jun 2023 05:16 IST

ఎమ్మెల్యేను ప్రశ్నించిన వైకాపా కార్యకర్త

పోతన్నను బుజ్జగిస్తున్న స్థానిక నాయకులు, పోలీసులు

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: మండల పరిధి శెట్టిపల్లి పంచాయతీ మారమ్మదిన్నలో మంగళవారం గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరనారాయణను అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త పోతన్న ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు కనీసం ఇల్లు మంజూరు చేయలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు శెట్టిపల్లి పంచాయతీ అహుడా పరిధిలో లేకపోవడంతో ఇల్లు మంజూరుకాలేదని, జులై 1వతేదీ నాటికి ఇల్లు వచ్చేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, నాయకులు పోతన్నను బుజ్జగించారు. బొజ్జిరెడ్డిపల్లిలో ఆదిలక్ష్మమ్మ ఇంటి వద్ద విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతున్నాయని, పక్కన స్తంభాలు ఏర్పాటు చేసి దాని పైకి లైన్‌ మార్చాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. విద్యుత్తు అధికారితో మాట్లాడి రెండురోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో సిమెంటు రోడ్లు, మురుగుకాలువలు నిర్మించాలని, పలువురు పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని