అధిక వేడితో జీర్ణాశయ సమస్యలు
వేసవిలో అధిక వేడి, వడదెబ్బతోపాటు రకరకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు సరేసరి.
* వేసవిలో అధిక వేడి, వడదెబ్బతోపాటు రకరకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు సరేసరి. చిన్న పిల్లలు, పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
* శరీర ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు జీర్ణ వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుంది. కడుపులో నొప్పి, మంట, విరేచనాలు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
* ఈ కాలంలో రోజుకు ఆరేడు గ్లాసుల నీళ్లు తాగాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. పెరుగు తీసుకోవడం వల్ల ప్రోబయోటిక్స్‌తో జీర్ణశక్తి పెరుగుతుంది.
* ఈ కాలంలో ఆహారం త్వరగా పాడవుతుంది. అది తీసుకుంటే గ్యాస్ట్రో సమస్యలకు దారితీస్తుంది. ఫుడ్‌పాయిజన్ అయ్యి అతిసారం, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు బయట తినడం తగ్గించుకోవాలి. ఇంట్లోనే ఏ పూటకాపూట వండుకుని తినడం మంచిది.
* వికారం, అతిసారం, పొత్తికడుపు తిమ్మిరి, జ్వరం, వాంతులు, పొట్ట ఉబ్బినట్లు అనిపిస్తే... ఫుడ్‌పాయిజన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. విందుల్లో పాల్గొన్నప్పుడు మితంగా తీసుకోవాలి.
* నీటి శాతం ఎక్కువగా ఉండే దోస, ఆనపకాయ, బీర, బీట్‌రూట్, ముల్లంగి తదితర కూరగాయలతోపాటు తోటకూర, పాలకూర, బచ్చలకూర ఇతర ఆకుకూరలు జీర్ణశక్తి సక్రమంగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య