logo

సమస్యలు పరిష్కరించకుంటే ప్రజల్లో తలెత్తుకోలేం

రెండు సంవత్సరాల నుంచి మురుగు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించకపోతే ప్రజల్లో ఎలా తలెత్తుకుని తిరగాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 08 Jun 2023 05:58 IST

తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం ముందు వైకాపా నాయకుడి ధర్నా

మున్సిపల్‌ కార్యాలయం ముందు బైఠాయించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కాలనీవాసులు

తాడిపత్రి, న్యూస్‌టుడే: రెండు సంవత్సరాల నుంచి మురుగు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించకపోతే ప్రజల్లో ఎలా తలెత్తుకుని తిరగాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం ముందు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ పురపాలికల్లో ముందు వరుసలో ఉన్న తాడిపత్రిలో నేడు ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.. మార్గబిలాల నుంచి మురుగు ఇళ్లల్లోకి వస్తోందని, దీంతో రోగాలబారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. అనంతరం అక్కడకు వచ్చిన ఇన్‌ఛార్జి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట సుబ్బయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి కృష్ణాపురం ఏడో రోడ్డులో మురుగు నీరు ఇళ్లల్లోకి వస్తోందని, తాగేందుకు నీరు సరిగా రాలేదని అనేకమార్లు తమకు చెబుతుంటే వారికి ఏమని సమాధానం ఇవ్వాలో అర్ధం కావడం లేదన్నారు. ఈ సమస్యలు 36 వార్డుల్లో ఉన్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. ఆఖరికి సమస్య పరిష్కారం కోసం తామే డబ్బు ఖర్చు పెట్టుకుంటామన్నా రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని, ఇక్కడే వంటావార్పు కూడా చేస్తామని స్పష్టం చేశారు. ఇన్‌ఛార్జి కమిషనర్‌ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో వరుసగా సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నామని, మీ కాలనీలో సమస్యను వెంటనే పరిశీలించి పరిష్కారం చూపుతామని చెప్పడంతో ధర్నా విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని