logo

వైద్యానికి వెళ్లి వస్తూ మృత్యువాత

కర్నూలుకు వెళ్లి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడటంతో పౌరసరఫరాల ఉపతహసీల్దారు మృతిచెందిన సంఘటన బుధవారం పెద్దవడుగూరు మండలం మిడుతూరు 44వ జాతీయ రహదారిలో చోటుచేసుకుంది.

Published : 08 Jun 2023 05:58 IST

రోడ్డు ప్రమాదంలో పౌరసరఫరాల ఉపతహసీల్దారు దుర్మరణం

కరుణాకర్‌ (పాతచిత్రం)

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: కర్నూలుకు వెళ్లి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడటంతో పౌరసరఫరాల ఉపతహసీల్దారు మృతిచెందిన సంఘటన బుధవారం పెద్దవడుగూరు మండలం మిడుతూరు 44వ జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండల రెవెన్యూ కార్యాలయంలో పౌరసఫరాల ఉప తహసీల్దారుగా పనిచేస్తున్న కరుణాకర్‌ (52) తన భార్య వరలక్ష్మి, కుమారుడు సాయితోపాటు కలసి వైద్యం కోసం కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు ఇక్కడకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరుణాకర్‌ అక్కడిక్కడే మృతిచెందగా.. భార్య, కుమారుడు, డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దవడుగూరు తహసీల్దారు నాగభూషణం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని