వైకాపాలో ఉండలేం..!
గౌరవం, గుర్తింపు లేని చోట ఉండలేకే వైకాపాను వీడుతున్నట్లు తలుపుల మండల మాజీ కన్వీనర్ శంకర్, పెద్దన్నవారిపల్లి పంచాయతీ ఉప సర్పంచి షేక్ బాషు, నూతన కాలువ ఎంపీటీసీ
మాట్లాడుతున్న నాయకులు
కదిరి, న్యూస్‌టుడే : గౌరవం, గుర్తింపు లేని చోట ఉండలేకే వైకాపాను వీడుతున్నట్లు తలుపుల మండల మాజీ కన్వీనర్ శంకర్, పెద్దన్నవారిపల్లి పంచాయతీ ఉప సర్పంచి షేక్ బాషు, నూతన కాలువ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లినాయుడు, గౌడ సంఘం మండల అధ్యక్షుడు రమణ, మండల నాయకుడు బావాజీ తెలిపారు. ఆదివారం కదిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపాలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2013 నుంచి వైకాపా బలోపేతానికి, రెండు పర్యాయాలు పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు కృషి చేసినట్లు వారు పేర్కొన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కేసుల్లో ఇరుక్కొని జైలుకు కూడా వెళ్లానని, దశాబ్ద కాలంగా మండల కన్వీనర్‌గా పనిచేస్తున్న తనకు ఒక్క మాటకూడా చెప్పకుండా, ఆ పదవి నుంచి తొలగించారని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తనకు నచ్చని వాలంటీర్లు, ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు. పదవులు, కాంట్రాక్టు పనులు ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు న్యాయం జరగలేదని చెప్పుకోవటం బాధగా అనిపిస్తోందన్నారు. గౌరవం, గుర్తింపు లేని వైకాపాలో కొనసాగలేమనే నిర్ణయంతో రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు రోషిరెడ్డి, విశ్వనాథరెడ్డి, బాబ్జాన్, సూరి, సోమశేఖర్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బావిలో పైపులు.. బాధలకు తార్కాణాలు!
-
‘Bharat Dal’ brand: రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!
-
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన
-
Weather Update: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు