logo
Updated : 24 May 2022 06:21 IST

కిలో రూ.80కు తీసుకుంటేనే ఇస్తాం

అధికారులకు తేల్చిచెప్పిన టమోట రైతులు 


  టమోట రైతులతో మాట్లాడుతున్న అధికారులు 

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రస్తుతం టమోట ధర అన్యూహ్యంగా పుంజుకుంటుండటంతో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు  చేస్తోంది. ఇందులో భాగంగా ఉద్యాన, మార్కెటింగ్‌శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో చర్చలు జరుపుతున్నారు. కిలో రూ.45 ఇవ్వాలని, రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని రైతులతో చర్చించినట్లు తెలిసింది. కిలో రూ.80కు తగ్గకుండా ప్రతిరోజు కొనుగోలు చేస్తేనే తామిస్తామని రైతులు స్పష్టం చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా మదనపల్లె మండలం కొత్తపల్లె, కొత్తవారిపల్లె, సీటీఎం, కోటావారిపల్లెల్లో ఆయా శాఖల అధికారులు పర్యటించగా, తాజాగా సోమవారం నిమ్మనపల్లె మండలంలోని పలు గ్రామాల్లోని రైతులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయమై మదనపల్లె ఉద్యానవనశాఖాధికారిణి ఉమ మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో టమోట కొనుగోలు చేసేందుకు రైతులతో చర్చించామన్నారు. కిలో రూ.80కి తక్కువకు ఇచ్చేదిలేదని రైతులు స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు. కొందరు రైతులు ప్రస్తుతం మార్కెట్‌లో ధరలున్నాయని, మార్కెట్‌కు రవాణా ఖర్చులు తక్కువగానే ఉంటాయని, వ్యాపారులకే అమ్ముతామని చెబుతున్నారన్నారు. జూన్‌ రెండో వారం నాటికి దిగుబడులు పెరిగే అవకాశాలున్నాయని, ధరలు కూడా తగ్గే అవకాశాలున్నాయని ఆమె వివరించారు.  

Read latest Annamayya News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts