logo
Updated : 26 Aug 2021 07:33 IST

AP News: కొద్ది గంటల్లో వివాహం.. పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ

మదనపల్లె(నేరవార్తలు): కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా సినీ ఫక్కీలో పెళ్లి పందిరి నుంచి పెళ్లికూతురు పరారైన సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు(26), తంబళ్ళపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఇరుకుటుంబాల వారు మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి ఏర్పాట్లు చేశారు. కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి వధూవరులకు నలుగు పెట్టారు. పెళ్లికుమార్తె రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా పరారైంది. తమకు అవమానం జరిగిందని పెళ్లి కొడుకు, బంధువులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పెళ్లికూతురు మైనర్‌ అని తేలింది. ఒకటో పట్టణ ఎస్సై లోకేష్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని