logo
Updated : 29/11/2021 06:36 IST

దారి లేక దయనీయం 

గ్రామాలకు రాకపోకలు బంద్‌

తాత్కాలిక పనులు చేయని వైనం

సదుం-పీలేరు మార్గంలో పాపిరెడ్డిగారిపల్లె వద్ద దెబ్బతిన్న రహదారి

వరదలతో వంతెనలు కుప్పకూలాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. రాకపోకలు నిలిచి ప్రయాణం కష్టంగా మారింది. వైద్య సేవలకు పడరాని పాట్లు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి జిల్లా ప్రజలు పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదని ఆరోపిస్తున్నారు. - ఈనాడు డిజిటల్‌, తిరుపతి

స్వర్ణముఖి వంతెన కొట్టుకుపోవడంతో చంద్రగిరి మండలం ఎం.కొత్తపల్లె పరిసర గ్రామాల ప్రజలు తాటి కొయ్యలను వంతెనలుగా చేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు

సదుం-పుంగనూరు మార్గంలో గార్గేయ నదిపై, సదుం- పీలేరు దారిలో పాపిరెడ్డిగారిపల్లె వద్ద, సదుం- కలికిరి మార్గంలో పచ్చార్లవంకపై వంతెనలు కొట్టుకుపోయాయి. ఇక్కడ రాకపోకలు లేకపోవడంతో వందలాది గ్రామాలు ఇబ్బందులు పడుతున్నారు.

నాగలాపురంలో టీపీకోట రహదారి 12 కి.మీ పొడవున కొట్టుకుపోయి వందలాది మంది అవస్థలు పడుతున్నారు.● పలమనేరు పట్టణం దండపల్లె దారిలో కౌండిన్య నదిపై నిర్మించిన వంతెన కొట్టుకుపోవడంతో 25 గ్రామాల వారికి రాకపోకల్లేవు.

సోమల నంజంపేట మధ్య జీడిరేవుల వంక వంతెన తెగిపోవడంతో ఏడు పంచాయతీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీరు మండల కేంద్రమైన సోమలకు రావాలంటే ఇనుప పైపుల మీద నడక సాగిస్తున్నారు. నంజంపేట, ఆవులపల్లె, 81 ఉప్పరపల్లె, పొదలగుంటపల్లె, పెద్ద ఉప్పరపల్లె, పేటూరు, చౌడేపల్లెకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి

 పూతలపట్టు- సామనత్తం మధ్య కనీసం కిలోమీటరు దూరం లేదు. ఇక్కడ వంతెన తెగిపోవడంతో సామనత్తంతో పాటు పరిసరాల్లో 15 గ్రామాల ప్రజలు 30 కి.మీ దూరం ప్రయాణించి పూతలపట్టుకు రావాల్సి వస్తోంది.

యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటే..

రహదారులు కొట్టుకుపోయిన, వంతెనలు కూలిపోయిన ప్రాంతాల్లో పైపులు అమర్చి నీటి ప్రవాహం సాఫీగా వెళ్లేలా చేసి.. రాళ్లు మట్టితో నింపి రహదారులను పునరుద్ధరించవచ్ఛు గతంలో జాతీయ రహదారులను సైతం గంటల వ్యవధిలో పునరుద్ధరించిన దాఖలాలున్నాయి. ఇదే తరహాలో జిల్లాలో రద్దీ ప్రాంతాల రహదారులను యుద్ధప్రాతిపదికన వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు

ప్రస్తుతం నిధులు లేకున్నా.. పనులు చేపట్టిన అనంతరం మంజూరవుతాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. చిన్నపాటి పనులు పూర్తి చేస్తున్నాం. త్వరలోనే తాత్కాలిక పనులు పూర్తి చేస్తాం. - దేవానందం, ఎస్‌ఈ, రహదారులు, భవనాల శాఖ

చిన్నపాటి పనులు చేశాం

జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ రహదారులు 185 తెగిపోగా.. 74 చోట్ల చిన్నపాటి మరమ్మతులు చేయించాం. ఇందుకు రూ.85 లక్షలు ఖర్చు పెట్టి పునరుద్ధరించాం. మిగిలిన పనులు చేయాల్సి ఉంది. -అమరనాథరెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం పంచాయతీరాజ్‌ ఆర్‌అండ్‌బీ

సోమల-నంజంపేట మార్గంలో కొట్టుకుపోయిన వంతెన

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని