logo
Published : 29/11/2021 06:30 IST

తూర్పున భారీ వర్షాలు..

అప్రమత్తమైన యంత్రాంగం


చెరువు నుంచి వృథాగా పోతున్న నీరు

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: పక్షం రోజులుగా ముంచెత్తిన ఉపద్రవం నుంచి ఇంకా కోలుకోకనే.. మళ్లీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఆదివారం తూర్పు మండలాల్లో భారీ వర్షం పడింది. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండుకుండలా మారాయి. మళ్లీ వర్షాలు కురుస్తుండడం ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆదివారం నాటి వర్షాలతో ముందు జాగ్రత్తగా తూర్పుప్రాంతంలోని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి కొంత ఖాళీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. వానలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, కలెక్టరు హరి నారాయణన్‌ కలిసి రాయలచెరువు, కల్యాణి డ్యాం, అరణియార్‌, కాళంగి ప్రాజెక్టులను సందర్శించి నీటి మట్టాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

సత్యవేడులో 57.0 మి.మీ

అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. సత్యవేడు మండలంలో అత్యధికంగా 57.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆదివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా తొట్టంబేడులో 10.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాళహస్తిలో 91.6 మి.మీ, వరదయ్యపాళెంలో 77.2, పిచ్చాటూరు 72.2, గుడిపాల 69.2, బీఎన్‌ కండ్రిగ 68.4, నాగలాపురం 65.4, ఏర్పేడు 58.6, నిండ్ర 55.2, సత్యవేడు 54.2, కె.వి.బి.పురం 48.6, తిరుపతి అర్బన్‌లో 20.2 మి.మీ వర్షం పడింది.

కండ్రుగుంట చెరువుకు గండి

శ్రీకాళహస్తి గ్రామీణం (తొట్టంబేడు): మండలంలోని కలవగుంట పంచాయతీ కండ్రుగుంట చెరువు కట్టకు ఆదివారం సాయంత్రం గండి పడింది. కోట, కండ్రుగుంట గ్రామాలకు చెందిన సుమారు 60 ఎకరాలలోని వరి పంట నీట మునిగింది.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని