logo
Updated : 29/11/2021 06:37 IST

స్వల్పంగా పెరిగిన టమోటా ధర 


ఎగుమతికి సిద్ధం చేసిన టమోటా

మదనపల్లె (గ్రామీణ): మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన టమోటా ధర ఆదివారం స్వల్పంగా పుంజుకుంది. మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో అత్యధికంగా కిలో రూ.80 పలికింది. మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ నెల 23న అత్యధికంగా కిలో రూ.130 పలికిన విషయం తెలిసిందే. తరవాత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి కొంత మేరకు వ్యాపారులు సరకును దిగుమతి చేసుకోవడంతో ఈనెల 25న ఒక్కసారిగా కిలో రూ.50కు పడిపోయింది. రెండు రోజులుగా స్వల్పంగా ధర పుంజుకుంది. మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం, తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట, తంబళ్ళపల్లె, ములకలచెరువు, కురబలకోట మండలాల నుంచి, సరిహద్దు కర్ణాటకలోని రాయల్‌పాడు, అడగళ్‌, శ్రీనివాసపురం ప్రాంతాల నుంచి రైతులు ఆదివారం మదనపల్లె మార్కెట్‌కు 150 టన్నుల టమోటా తీసుకువచ్చారు. దీంతో ఏ గ్రేడ్‌ కిలో రూ.55 నుంచి రూ.80, బి గ్రేడ్‌ కిలో రూ.14 నుంచి రూ.51 వరకు పలికాయి. సగటున కిలో రూ.34 నుంచి రూ.69 వరకు కొనుగోలు చేశారని మార్కెట్‌ యార్డు కార్యదర్శి అక్బర్‌బాషా తెలిపారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని