logo
Published : 29/11/2021 06:30 IST

శ్రీవారి మెట్టు మార్గంలో తాత్కాలిక ఏర్పాట్లు


సమావేశంలో మాట్లాడుతున్న తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల ఘాట్‌రోడ్లలో కొండచరియలు విరిగి పడడం, రోడ్లు కుంగిపోవడం వంటి సంఘటనలు నివారించేందుకు నిపుణుల కమిటీ సిఫారసు మేరకు రాక్‌బోల్ట్‌ టెక్నాలజీని ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈవో మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు వాటివల్ల జరిగే నష్టాన్ని, ప్రమాదాలను ముందుగానే అంచనావేసి భక్తులకు హెచ్చరికలు జారీచేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందు కోసం తితిదేలోని విభాగాల సమన్వయంతో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శ్రీవారి మెట్టు మార్గంలో పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున తాత్కాలిక ఏర్పాట్లు వెంటనే చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వర్షం తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించేందుకు స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ) ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల ఆలయం, మాడవీధులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి వర్షపు నీరు రాకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, నీరు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై నివేదిక తయారు చేయాలన్నారు. సమావేశంలో తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, ఎఫ్‌ఏసీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని