logo
Published : 29/11/2021 06:30 IST

విద్యుదాఘాతంతో ఇంటర్‌ విద్యార్థి మృతి


కిషోర్‌ (పాతచిత్రం)

 

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: వరదయ్యపాలెం మండలంలోని నెలటూరులో విద్యుదాఘాతానికి ఇంటర్‌ విద్యార్థి గుమ్మడి కిషోర్‌(17) మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుమ్మడి రమేష్‌ కుమారుడు కిషోర్‌ వరదయ్యపాలెం జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం వర్షం కారణంగా ఇంటి గోడలకు విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్‌ అయింది. గమనించని కిషోర్‌ గోడలను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఎన్నోఆశలు పెట్టుకున్న చెట్టంత కొడుకు కళ్లముందే మృతి చెందడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని