logo
Published : 02/12/2021 03:47 IST

ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం


ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు

చిత్తూరు(వైద్యవిభాగం): ఎయిడ్స్‌ మహమ్మారిని అవగాహనతో తరిమికొట్టాలని, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. గోడపత్రాలను విడుదల చేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. వైద్య రంగంలో కృషి చేసిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. ముందుగా నగరంలో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా కార్యదర్శి కరుణకుమార్‌, ఏడీఎంహెచ్‌వో అరుణసులోచనాదేవి, ప్రోగ్రాం మేనేజర్‌ లలిత, జిల్లా టీబీ అధికారి రమేష్‌, నగరపాలక వైద్యాధికారి శ్రీనివాసరావు, అపోలో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జయంతి పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని