logo
Published : 02/12/2021 03:47 IST

చిరుతలెన్నున్నాయో..!

సర్వే చేస్తున్న ప్రత్యేక బృందం

పలమనేరు, న్యూస్‌టుడే: జిల్లా చిరుతల ఆవాసంగా మారింది. పదేళ్లుగా మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా వివిధ అడవి జంతువులు ఇక్కడ తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. అందులో భాగంగా చిరుతల సంఖ్య కూడా పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా పులుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనూ లెక్కించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ప్రస్తుతం ఓ బృందం రాష్ట్రంలోని చిత్తూరు, శ్రీశైలం అడవుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా లెక్కింపు చేపట్టింది. జిల్లాలో గత రెండు నెలల్లో రెండు చిరుతలు చనిపోయాయి. ప్రస్తుతం 8 వరకు ఉంటాయని అంచనా. అందులో రెండు మగవి, రెండు ఆడవి ఉండటంతో సంతానోత్పత్తి చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీటితో పాటు 40 వేల హెక్టార్లలో విస్తరించిన పలమనేరు అడవిలో జింకలు, అడవి కోళ్లు, పందులు, కుందేళ్లు వేల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. సర్వే పూర్తయ్యేలోగా ఎన్ని ఉంటాయో చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఇటీవల వేటగాళ్ల సంఖ్యా పెరిగింది.

ప్రశ్నార్థకంగా సంరక్షణ

ఈ ఏడాడి ముసలిమడుగు అడవిలో వేటగాళ్ల బారిన పడి ఎలుగుబంటి మృతిచెందటంతో వాటి కదలికలు కూడా గుర్తించారు. పలమనేరు నుంచి తమిళనాడు వెళ్లే మార్గంలో సైనిగుంట ప్రాంతంలో చిరుతను కొందరు ప్రత్యక్షంగా చూశారు. టేకుమంద, బండమీదజరావారిపల్లె, మంజునాథకాలనీ ప్రాంతాల్లో చిరుతల దాడిలో పశువులు, గొర్రెపిల్లలు మృత్యువాత పడిన ఘటనలున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అటవీ శాఖకు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి రావడం లేదు.

వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది

వన్యప్రాణుల సంఖ్య కచ్చితంగా పెరుగుతోంది. ఇటీవలే ప్రత్యేక బృందం పులులు, చిరుతల గణన మొదలుపెట్టింది. వారి నుంచి వివరాలు అందాల్సి ఉంది. -రవిశంకర్‌, డీఎఫ్‌వో, చిత్తూరు


చిరుత కళేబరం

వన్యప్రాణుల సంఖ్య

ఏనుగులు 72

చిరుతలు 8

ఎలుగుబంట్లు 4

జింకలు, దుప్పులు 10 వేలు

అడవి కోళ్లు, కుందేళ్లు 20 వేలు

అడవి పందులు 40 వేల వరకు

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని