logo
Published : 02/12/2021 03:47 IST

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై పరిశీలన


ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, కలెక్టర్‌

హరినారాయణన్‌, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి; న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక), ఏర్పేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం విధులు కేటాయించిన పోలీసు, వైద్య, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి ఏర్పేడు మండలంలో పర్యటించనుండటంతో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. తిరుపతి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరపాలిక అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ఆటోనగర్‌, కృష్ణానగర్‌, ముత్యాలరెడ్డిపల్లె ప్రాంతాల్లో పర్యటించారు. యంత్రాంగం ఈ ప్రాంతాల్లో వీధుల శుభ్రత, రోడ్ల మరమ్మతు పనులు చేపట్టింది.

షెడ్యూల్‌ ఇలా..

గురువారం: మధ్యాహ్నం 3.30 - రేణిగుంట విమానాశ్రయానికి రాక

 3.55 - 4.30: వెదళ్లచెరువు ఎసీ్టీ కాలనీ, పాపానాయుడుపేట సందర్శన

 5.10 - 5.25: తిరుపతి గ్రామీణ మండలం పాడిపేట పరిశీలన, వరద బాధితుల పరామర్శ.

6.00: తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి సముదాయంలో సమీక్ష, రాత్రి బస

శుక్రవారం: ఉదయం 8.40- 10.00: తిరుపతి శ్రీకృష్ణనగర్‌, ఆటో నగర్‌లో పర్యటన

 10.30: రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరు పయనం

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని