logo
Published : 02/12/2021 03:47 IST

విద్యార్థి మృతిపై అనుమానాలు

బావాజీ (పాతచిత్రం)

పీలేరు గ్రామీణ: విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... పీలేరు మం డలం అడవిపల్లెకు చెందిన శేఖర్‌ ఇసుక తరలించేందుకు తలపుల కస్పా నుంచి యువకులను తీసుకెళ్లేవాడు. గత నెల 9న రాత్రి తలపుల కస్పాకు చెందిన నలుగురు యువకులను ట్రాక్టర్‌లో తీసుకెళ్లాడు. కూలీగా ఇదే గ్రామానికి చెందిన విద్యార్థి బావాజీ(25) కూడా వెళ్లాడు. ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడటంతో అతను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ విషయమై బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల ఇచ్చేలా, కేసు లేకుండా ట్రాక్టర్‌ యజమాని స్థానికులతో రాజీ కుదుర్చుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఉంటారని భావించిన తల్లిదండ్రులు సరేనన్నారు. తొలుత రూ.20 వేలు ఇచ్చా రు. మరో రూ.30 వేలు ఇచ్చి సరిపెట్టేందుకు యత్నిస్తున్న ట్రాక్టర్‌ యజమానికి గతంలో ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని విద్యార్థి తల్లిదండ్రులు నేరుగా జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. పీలేరు ఎస్సై తిప్పేస్వామి, తహసీల్దార్‌ రవి, ప్రభుత్వ వైద్య బృందం బుధవారం సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి వివరాలను నమోదు చేసుకున్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని