logo
Published : 02/12/2021 03:47 IST

వృద్ధాప్యం ఆనందమయం

మలిదశలోని వారి సేవలో రాస్‌ స్వచ్ఛంద సంస్థ


రాస్‌ ఆశ్రమంలో వసతి పొందుతున్న వృద్ధులు

శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే: ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట రాస్‌ స్వచ్ఛంద సంస్థ వృద్ధుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. చిత్తూరు, కడప, అనంతపురం, తిరుత్తణి జిల్లాల్లో 12 వృద్ధా శ్రమాలను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందిస్తోంది. 1996 నుంచి ఇప్పటి వరకు వేలాది మందికి వసతి కల్పిస్తూ ఆదరిస్తోంది. నిత్యం యోగా, క్రీడలు, భజనలు నిర్వహిస్తున్నారు. హెల్పేజ్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో 2000లో వినూత్నంగా వృద్ధాప్య పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అందిస్తున్న పింఛనుతో 12మంది వృద్ధులతో సంఘంగా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో రూ.20 చొప్పున, ప్రస్తుతం రూ.వంద నెల వారీ పొదుపు చేస్తున్నారు. ఏర్పేడు, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో 70 సంఘాలుగా ఏర్పడి రూ.కోటికి పైగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

డిజిటల్‌పై అవగాహన తరగతులు

ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా 2018లో తిరుపతిలో వృద్ధాప్య సంఘాల సభ్యులకు కంప్యూటర్‌ తరగతులను ప్రారంభించారు. ఆన్‌లైన్లో సంగీతం, క్రీడలు, బొమ్మలు గీయడం, లెక్కలు చేయడం, యూట్యూబ్‌, గూగుల్‌ వంటివాటి గురించి అవగాహన కల్పిస్తున్నారు.

తీర్థయాత్రలు, వైద్యసేవలు

వృద్ధాప్యంలో తీర్థయాత్రలు చేయాలనే ఆలోచనలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు కోరిన ప్రాంతాలకు రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. వైద్యపరీక్షలు చేయిస్తున్నారు.

సంతోషంగా గడుపుతున్నా

మర్రిమందలోని రాస్‌ ఆశ్రమంలో ఉంటున్నా. తోటి ముసలివాళ్లతో కలిసి రోజంతా సరదాగా గడుపుతూ కబర్లు చెప్పుకుంటున్నాం. రుచికరమైన మంచి భోజనం, పండ్లు, పాలు పెడుతుండటంతో సంతోషంగా ఉన్నా. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. - చిన్నమ్మ

ఆరోగ్యం, ఆనందం

వృద్ధాప్యంలో పొదుపు సంఘంలో చేరడంతో అవసరమైనప్పుడు డబ్బు అందుతోంది. పొదుపు డబ్బును కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంతో ఆర్థికంగా బాగున్నాం. కంప్యూటర్‌పై కాస్త అవగాహన ఉండటంతో ఇప్పటి పరిస్థితులను ఆర్థంచేసుకోగలగుతున్నా- సుబ్బయ్య

మరన్నిసేవలు అందిస్తాం

వృద్ధాప్యజీవితం ఆనందంగా గడిపేందుకు ఇలాంటి సేవలను ప్రవేశపెట్టాం. మారుతున్న కాలానుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ఇదేరీతిలో మరన్ని సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టాం. - బాలాజీరెడ్డి, పీడీ, రాస్‌స్వచ్ఛంద సంస్థ

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని