logo
Published : 02/12/2021 03:47 IST

ప్రయోగం

కలికిరి ఇంజినీరింగ్‌ విద్యార్థుల ప్రతిభ


పరిశ్రమలు, ఇళ్లలో ఉపయోగపడే రోబోటిక్‌ నమూనాతో మెకానికల్‌ విద్యార్థులు

కలికిరి గ్రామీణ, పీలేరు గ్రామీణ: రోబోలతో గృహావసరాలు ఎలా తీర్చుకోవచ్చో ప్రయోగాలు చేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నారు. కలికిరి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ మెకానికల్‌ విభాగం మొదటి ఏడాది విద్యార్థులు దక్షిత్‌, గాయత్రి, భవజ్ఞ, చరితశ్రీ, అఫాన్‌ బృందంగా ఏర్పడి పరిశ్రమలు, గృహోపకరాలకు ఉపయోగపడే రోబోటిక్‌ మోడల్‌ను తయారు చేశారు. భవిష్యత్తులో పరిశ్రమలు, ఇళ్లలో రోబోల సాయంతో పనులు చేసే ప్రోగ్రాంను సిద్ధం చేశారు. మనం వెళ్లమన్న చోటుకు వస్తువులను తీసుకెళతాయి. చరవాణితో ఆపరేట్‌ చేసే విధంగా రూపొందించారు. అనంతపురం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇటీవల జరిగిన ప్రదర్శనలో ఈ విద్యార్థులు సమర్పించిన పవర్‌ ప్రజంటేషన్‌ నమూనా రాష్ట్రస్థాయిలో బహుమతి గెల్చుకుంది.

బూజు దులిపే డ్రోన్‌... కలికిరి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ మెకానికల్‌ చివరి ఏడాది విద్యార్థులు కొండయ్య, మనోజ్‌కుమార్‌, కావ్యశ్రీ, అరుణకుమారి ఎత్తయిన భవనాలను శుభ్రపరిచే డ్రోన్‌ను తయారుచేశారు. ఈ విధానం ద్వారా ఎత్తయిన భవనాలు మానవ శక్తితో పరిశుభ్రత వీలుకాని ప్రదేశాలలో అతి సులభంగా బూజును శుభ్రం చేయొచ్ఛు ఈ డ్రోన్‌ యంత్రం పంటలపై క్రిమిసంహారక మందుల పిచికారీ, పెయింటిగ్‌ పనులు, వస్తువులను ఒకచోట నుంచి మరొక చోటికి త్వరగా చేరుస్తాయి. ఈ డ్రోన్‌ నందు ఫ్రేమ్‌, మోటారు, ఎలక్ట్రానిక్‌ స్పీడ్‌ కంట్రోలర్‌, లిపో బ్యాటరీ, ట్రాన్స్మిటర్‌, రిసీవర్‌ తదితరాలను ఉపయోగించి తయారు చేసినట్లు గైడ్‌, అధ్యాపకులు నూర్‌ అహ్మద్‌ తెలిపారు.

డ్రోన్‌ పరికరంతో నూర్‌అహ్మద్‌

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని