logo
Published : 02/12/2021 03:47 IST

పశుసంజీవని పథకం ప్రారంభం

ప్రత్యేక పశువైద్య కిట్లను అందజేస్తున్న పశుసంవర్ధక శాఖ జేడీ వెంకట్రావు

చిత్తూరు (వ్యవసాయం): పశువులకు మెరుగైన పశువైద్య సేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వైఎస్సార్‌ పశుసంజీవని పథకాన్ని ప్రారంభించిందని పశుసంవర్ధక శాఖ జేడీ వెంకట్రావు తెలిపారు. జిల్లాలో ఈ పథకం అమలుపై పశువైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ పథకం కింద జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ప్రతి నెలా డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున నాలుగు గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. పశువైద్య నిపుణులు శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధులు, శస్త్ర చికిత్సలు, సాధారణ వైద్యసేవలందించి మందులు అందజేయాలని చెప్పారు. పశువైద్య నిపుణులకు జేడీ ప్రత్యేక మెడికల్‌ కిట్లను అందజేశారు. ఏడీలు భవానీశంకర్‌, మంగేశ్వరరావు, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని