logo

అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు

అమరావతి రైతుల పాదయాత్ర ఈ నెల 8న శ్రీకాళహస్తి సమీపంలో జిల్లాలోకి ప్రవేశించనుందని.. తెదేపా నియోజకవర్గాల బాధ్యుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకనున్నట్లు ఎమ్మెల్సీ రాజసింహులు, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు

Published : 05 Dec 2021 05:59 IST


మాట్లాడతున్న నాని, రాజసింహులు, హేమలత తదితరులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): అమరావతి రైతుల పాదయాత్ర ఈ నెల 8న శ్రీకాళహస్తి సమీపంలో జిల్లాలోకి ప్రవేశించనుందని.. తెదేపా నియోజకవర్గాల బాధ్యుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకనున్నట్లు ఎమ్మెల్సీ రాజసింహులు, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని తెలిపారు. తెదేపా జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 8 నుంచి 17వ తేదీ వరకు యాత్ర జిల్లాలో సాగుతుందని, 17న బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్ర భవిష్యతు దృష్ట్యా రాజధాని అమరావతి కోసం రైతుల పాదయాత్రకు పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఓటీఎస్‌ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపించారు.జిల్లాలో వరద బాధితుల కోసం చంద్రబాబు పర్యటించి ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తే, సీఎం జగన్‌ విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్లారని, ఆయన పర్యటనతో బాధితులకు ఒరిగిందేమీ లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని