logo

తితిదే కార్మికులకు అండగా నిలవాలి

తితిదేలో 15 ఏళ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని.. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. తితిదే పరిపాలన భవనం ఎదుట నిరసన దీక్ష చేస్తున్న

Published : 05 Dec 2021 05:59 IST

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌


ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న శైలజానాథ్‌

తిరుపతి(గాంధీరోడ్డు): తితిదేలో 15 ఏళ్లుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని.. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. తితిదే పరిపాలన భవనం ఎదుట నిరసన దీక్ష చేస్తున్న ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులకు ఆయన శనివారం సంఘీభావం ప్రకటించారు. తితిదే ఉన్నతాధికారులు భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కార్మికుల సమస్య పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

బాధితులకు పరామర్శ: తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శైలజానాథ్‌ పర్యటించారు. లక్ష్మీపురం కూడలిలో వరదల్లో కొట్టుకుపోయి మరణించిన సుబ్బరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణానగర్‌లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. నాయకులు మాగాంటి గోపాల్‌ రెడ్డి, నవీన్‌కుమార్‌ రెడ్డి, వెంకట నరసింహులు, నారాయణ, మురళీకృష్ణ, లీలా శ్రీనివాస్‌, సుప్రజ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని