logo

రోశయ్య మృతి తీరనిలోటు: ఉమ్మారెడ్డి

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి విచారకరమని వైకాపా సీనియర్‌ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక లక్ష్మినగర్‌కాలనీలోని ఎమ్మెల్యే శ్రీనివాసులు నివాసానికి శనివారం ఆయన విచ్చేశారు. వెంకటేశ్వర్లును..ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు

Published : 05 Dec 2021 05:59 IST


రోశయ్యతో టిసీరాజన్‌ (పాతచిత్రం)

చిత్తూరు నగరం: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి విచారకరమని వైకాపా సీనియర్‌ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక లక్ష్మినగర్‌కాలనీలోని ఎమ్మెల్యే శ్రీనివాసులు నివాసానికి శనివారం ఆయన విచ్చేశారు. వెంకటేశ్వర్లును..ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన రోశయ్యతో తనకు బాల్యం నుంచే స్నేహం ఉందన్నారు. రోశయ్య మృతి వ్యక్తిగతంగా తనకు నష్టమేనని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుడిపాల: మాజీ సీఎం, గవర్నర్‌ రోశయ్య మృతి పట్ల తెదేపా మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, అధికార ప్రతినిధి గోళ్ల హేమాద్రి సంతాపాన్ని తెలిపారు.


చిత్తూరు: రోశయ్య మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్న తెదేపా నేతలు

చిత్తూరు జడ్పీ: మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య మృతి రాష్ట్రానికి తీరనిలోటని జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు అన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిత్తూరు(జిల్లా పంచాయతీ): మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతికి నాయకులు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాభూతిని తెలియజేశారు. మాజీ మేయర్‌, నగర పార్టీ అధ్యక్షరాలు కఠారి హేమలత, మాజీ ఉప మేయర్‌ సుబ్రహ్మణ్యం, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌నాయుడు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు షణ్ముగం, కార్యాలయ కార్యదర్శి మోహన్‌రాజ్‌, జహంఘీర్‌ఖాన్‌ పాల్గొన్నారు. కుప్పం పట్టణం: రోశయ్య మృతి కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డా.బీఆర్‌ సురేష్‌బాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ సుధీర్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అశ్విని, గాంధీ విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘ నాయకులు, భాజపా నాయకులు తులసీనాథ్‌ నివాళులర్పించారు. పలమనేరు: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య రాజకీయాల్లో నిబద్ధత కలిగి ఉండేవారని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు ఆర్‌వీ సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. పొట్టిశ్రీరాములు బజారువీధిలో రోశయ్య చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు నివాళులు అందించారు. సంఘ నాయకులు సత్యప్రకాష్‌, విజయ్‌కుమార్‌, న్యాయవాది కుప్పరాజులు, శ్రీపురం సీతారామయ్య పాల్గొన్నారు.

రోశయ్య మృతికి స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు టీసీరాజన్‌ సంతాపం తెలిపారు. తనకు ఆయనతో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని గుర్తు చేసుకున్నారు.


కుప్పం: నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని