logo

రేంజ్‌ పోలీసులకు డీఐజీ మార్గదర్శి

జిల్లాలో ఎస్పీగా పోలీసుల సంక్షేమం కోసం కృషిచేసి.. డీఐజీ హోదాలో మళ్లీ అదే పోలీసులకు మరిన్ని సేవలు అందించి విజయవాడ పోలీసు కమిషనరుగా వెళుతున్న కాంతిరాణ టాటాకు పోలీసు అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. చిత్తూరు

Published : 05 Dec 2021 05:59 IST


కాంతిరాణటాటాను సత్కరిస్తున్న ఎస్పీ, అధికారులు

చిత్తూరు(నేరవార్తలు): జిల్లాలో ఎస్పీగా పోలీసుల సంక్షేమం కోసం కృషిచేసి.. డీఐజీ హోదాలో మళ్లీ అదే పోలీసులకు మరిన్ని సేవలు అందించి విజయవాడ పోలీసు కమిషనరుగా వెళుతున్న కాంతిరాణ టాటాకు పోలీసు అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. చిత్తూరు పోలీసు అతిథిగృహంలో శనివారం పోలీసు అధికారులు డీఐజీని ఘనంగా సత్కరించి వినాయకుడి ప్రతిమ బహూకరించారు. కాణిపాకం వేద పండితులు ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మాట్లాడుతూ పోలీసుశాఖలో కాంతిరాణటాటా నాయకత్వ లక్షణాలు సహా మానవత్వం ఉన్న వ్యక్తి అన్నారు. డీఐజీ కాంతిరాణటాటా మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టమైన పనినైనా సాధించొచ్చన్నారు. ఎస్‌ఈబీ జేడీ విద్యాసాగర్‌నాయుడు, ఏఎస్పీ మహేష్‌, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, తిప్పేస్వామి, బాబుప్రసాద్‌, లక్ష్మీనారాయణరెడ్డి, కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని