logo

‘చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దాం’

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి వచ్చే ఎన్నికల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి మీరా, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు కార్జాల

Published : 05 Dec 2021 05:59 IST


సత్కారం అందుకుంటున్న తెలుగు మహిళలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి వచ్చే ఎన్నికల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి మీరా, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు కార్జాల అరుణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న పిలుపునిచ్చారు. స్థానిక తెదేపా కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుమహిళలు సత్తాచూపి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు కార్చిన కన్నీళ్లు తెలుగుతల్లి గౌరవాన్ని నిలబెట్టడానికే అన్నారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు వివరించాలని సూచించారు. సమావేశంలో పలమనేరు నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు శివకుమారి, కుప్పం నియోజకవర్గ అధ్యక్షురాలు అనసూయ, నగరి నియోజకవర్గ అధ్యక్షురాలు సంపూర్ణమ్మ, జీడీనెల్లూరు నియోజకవర్గ అధ్యక్షురాలు రాధమ్మ, చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షురాలు సావిత్రి, మహిళా సభ్యులు విక్టోరియా, నిరోష, చంద్రకళ, ముంతాజ్‌, శ్రీదుర్గ, సుగుణమ్మ, వసంతమ్మ పాల్గొన్నారు.

దొంగ ఓటర్లను అడ్డుకున్న తెలుగు మహిళలకు సత్కారం

చిత్తూరు(జిల్లా పంచాయతీ): కుప్పం పురపాలక ఎన్నికల్లో దొంగ ఓటర్లను గుర్తించి అడ్డుకున్న తెలుగు మహిళలను శనివారం చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. తెలుగుమహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి మీరా, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు కార్జాల అరుణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న, పలువురు తెలుగు మహిళలు కుప్పం ప్రాంతానికి చెందిన తెలుగుమహిళా సభ్యులు వసంతమ్మ, సుగుణమ్మ, చంద్రకళ, అనసూయను సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని