logo

ఘాట్‌రోడ్డు ప్రమాదాలపై అమృత వర్సిటీ బృందం పరిశీలన

తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో ప్రమాదాల నివారణపై కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ స్లైడ్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ ప్రాజెక్టు చేస్తున్న పరిశోధక నిపుణుల బృందం పరిశీలన చేయనున్నట్లు తితిదే ఈవో

Published : 05 Dec 2021 05:59 IST

తితిదే ఈవో జవహర్‌రెడ్డి


రెండో ఘాట్‌రోడ్డులో జరుగుతున్న పనులు పరిశీలిస్తున్న తితిదే ఈవో జవహర్‌రెడ్డి తదితరులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో ప్రమాదాల నివారణపై కేరళ రాష్ట్రం కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ స్లైడ్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ ప్రాజెక్టు చేస్తున్న పరిశోధక నిపుణుల బృందం పరిశీలన చేయనున్నట్లు తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆఫ్కాన్‌ సంస్థ ఇంజినీరింగ్‌ నిపుణులు, తితిదే ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని, లింక్‌ రోడ్డును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఘాట్‌రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని, అంతవరకు లింక్‌ రోడ్డు ద్వారా మోకాళ్ల మెట్టు నుంచి తిరుమలకు అనుమతించడం ద్వారా భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించినట్లు వివరించారు. తితిదే ఇంజినీరింగ్‌ అధికారులకు విపత్కర సమయాలను ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వర్షాలతో భక్తుల రాకపోకలను నిలిపివేసిన పాపవినాశనం, ఆకాశగంగకు అనుమతించేందుకు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఈ నాగేశ్వరరావు, జేెఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, వీజీవో బాలిరెడ్డి, ఈఈ సురేంద్రరెడ్డి, ఆఫ్కాన్‌ సంస్థ ఇంజినీరింగ్‌ నిపుణులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని