logo

నిధుల్లేక నిరీక్షణ

జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారాల(సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమృత్‌ పథకం ద్వారా వీటిని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన రేణిగుంటలో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు నడుస్తోంది

Published : 17 Jan 2022 03:13 IST

ఆగిన అమృత్‌ పథకం పనులు

సువర్ణముఖి నదీ తీరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు

జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారాల(సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమృత్‌ పథకం ద్వారా వీటిని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన రేణిగుంటలో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు నడుస్తోంది. శ్రీసిటీలోనూ ఈ ప్లాంటు చక్కగా పనిచేస్తోంది. శ్రీకాళహస్తి, మదనపల్లెలో ఈ పనులకు నిధుల లేమి ప్రధాన సమస్యగా మారింది. - న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

అమృత్‌ పథకంలో భాగంగా సువర్ణముఖి ప్రక్షాళన పరిధిలో మురుగునీటి శుద్ధీకరణ కర్మాగార నిర్మాణానికి వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రారంభోత్సవం జరిగింది. రూ.22.82 కోట్లతో ఈ పనులు ప్రజారోగ్య శాఖ పర్యవేక్షణలో సాగుతోంది. పనులకు సంబంధించి పురపాలక సంఘం వాటాగా రూ.7.32 కోట్లను 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మూడు విడతలుగా చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన రూ.10.77 కోట్లు చెల్లించలేమని ప్రభుత్వం చెప్పడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ నిధులను కూడా పురపాలక సంఘం నుంచే మళ్లించాలని చెప్పడంతో నిధుల కోసం వెంపర్లాట తప్పడం లేదు. ఇప్పటి వరకు పనులు నిర్వహిస్తున్న గుత్తేదారునికి ప్రభుత్వం నుంచి అందింది కేవలం రూ.2.85 కోట్లు మాత్రమే. ఈ పరిస్థితుల్లో పనులు ఆగకుండా గుత్తేదారునికి బిల్లులు చెల్లించేందుకు అధికారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.

మదనపల్లెలోనూ..

అమృత్‌ పథకంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రూ.15.95 కోట్లు వ్యయంతో ఎస్‌టీపీ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారాక నిధులు సక్రమంగా రాకపోవడంతో నెల్లూరుకు చెందిన గుత్తేదారులు ఈ పనులు పూర్తి చేయక వదలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ పనుల్లో పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన ఉండిపోయింది.

నివేదిక రావాల్సి ఉంది

అమృత్‌ పథకం ద్వారా జరుగుతున్న ఎస్‌టీపీ పనులకు సంబంధించి ఇప్పటి వరకు పురపాలక సంఘం తరఫున రూ.7.32 కోట్లు చెల్లించాం. ఈ నిధులతో ఏఏ పనులు చేపట్టారన్న విషయమై నివేదికను ప్రజారోగ్యశాఖను కోరాం. వాళ్లిచ్చే నివేదిక ఆధారంగా మలివిడత నిధుల కోసం సన్నాహాలు చేస్తున్నాం. పనులైతే యథావిధిగా జరుగుతున్నాయి. -వెంకటరమణ, డీఈ పురపాలక సంఘం, శ్రీకాళహస్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని