logo

వ్యాక్సినేషన్‌కు ఏడాది

జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి నిరోధానికి టీకా వచ్చి ఏడాది పూర్తయింది.. గతేడాది జనవరి 13న వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా.. 16న తొలిగా కొవిషీల్డు టీకాతో ప్రక్రియ మొదలైంది. జిల్లాకు గతేడాది జనవరి 16న మొదట కొవిషీల్డు అందుబాటులోకి వచ్చింది. దశల వారీగా ఇప్పటివరకు కొవాగ్జిన్‌ 10,59,190 డోసులు, కొవిషీల్డు 54,76,600

Published : 17 Jan 2022 03:13 IST

న్యూస్‌టుడే, చిత్తూరు(వైద్యం): జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి నిరోధానికి టీకా వచ్చి ఏడాది పూర్తయింది.. గతేడాది జనవరి 13న వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా.. 16న తొలిగా కొవిషీల్డు టీకాతో ప్రక్రియ మొదలైంది. జిల్లాకు గతేడాది జనవరి 16న మొదట కొవిషీల్డు అందుబాటులోకి వచ్చింది. దశల వారీగా ఇప్పటివరకు కొవాగ్జిన్‌ 10,59,190 డోసులు, కొవిషీల్డు 54,76,600 డోసులు వచ్చాయి. అందులో 10,17,705 డోసుల చొప్పున కొవాగ్జిన్‌ టీకా వేయగా.. 52,31,850 కొవిషీల్డు డోసులు టీకా వేశారు. ఇప్పటికి జిల్లాలోని 137 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో కొవాగ్జిన్‌ 41,485 డోసులు, కొవిషీల్డు 2,44,750 డోసులు అందుబాటులో ఉన్నాయి.

విజయవంతం: జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైంది. గతేడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు 65,75,084 మందికి వ్యాక్సిన్‌ అందించారు. మొదటి డోసు కింద 34,44,395 మందికి టీకా అందించి 101.68 శాతం లక్ష్యం సాధించారు. రెండో డోసు కింద 29,41,632 మందికి వ్యాక్సిన్‌ వేసి 85.40 శాతం లక్ష్యం సాధించారు. 15-18 ఏళ్ల లోపు వారికి ఈ నెల 3 నుంచి 12వరకు 1,71,854 మందికి టీకా వేశారు.బూస్టర్‌ డోసు కింద ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 6,708, హెల్త్‌కేర్‌ వర్కర్లు 9,026, వృద్ధులకు 1,469 మందికి వెరసి 17,203 మందికి బూస్టర్‌ డోసు వేశారు. అందరూ టీకా వేసుకునేలా కలెక్టర్‌ హరినారాయణన్‌ పర్యవేక్షణలో జేసీ శ్రీధర్‌ ప్రోత్సహిస్తున్నారు.

లక్ష్యం సాధిస్తాం..

టీకాతోనే వైరస్‌ను తరిమికొట్టాలి. వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధిస్తాం. టీకాతో అనారోగ్య సమస్యలు రావు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేయించుకోవాలి. -శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జి జిల్లా టీకాల అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని