logo

తెలుగు భూమికి గుర్తింపు దక్కాలనే పాదయాత్ర

జాతీయ పతకాన్ని, జాతీయ గీతాన్ని దేశానికి తీర్చిదిద్ది అందించిన చరిత్ర తెలుగు భూమిదేనని నేషనల్‌ యాంథమ్‌ అండ్‌ ప్లాగ్‌ ఫైటర్‌ ప్రజాపతి తెలిపారు. జాతీయ గీతాన్ని అందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతజయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం తగదన్నారు. స్వాతంత్రోద్యమంలో తెలుగువారి

Published : 17 Jan 2022 03:13 IST


జాతీయ పతాకంతో అల్లూరి సీతారామరాజు వేషధారణలో ప్రజాపతి

ములకలచెరువు (గ్రామీణ), న్యూస్‌టుడే: జాతీయ పతకాన్ని, జాతీయ గీతాన్ని దేశానికి తీర్చిదిద్ది అందించిన చరిత్ర తెలుగు భూమిదేనని నేషనల్‌ యాంథమ్‌ అండ్‌ ప్లాగ్‌ ఫైటర్‌ ప్రజాపతి తెలిపారు. జాతీయ గీతాన్ని అందించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతజయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం తగదన్నారు. స్వాతంత్రోద్యమంలో తెలుగువారి భాగ్యస్వామ్యం ఉన్నందున, తెలుగు భూమికి గుర్తింపు దక్కాలని గత ఏడాది డిసెంబర్‌ 6న శ్రీకాకుళం జిల్లాలోని, అరసవిల్లి నుంచి తొలిసారిగా జనగణమణ గీతాలాపన జరిగిన జిల్లాలోని మదనపల్లె బీటీ కళాశాల వరకు ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. ఆదివారం పులివెందుల, కదిరి మీదుగా సొంత గ్రామమైన ములకలచెరువు మండలం నాయునిచెరువుపల్లెకు చేరుకొని మొక్కు చెల్లించారు. సోమవారం ములకలచెరువు నుంచి మదనపల్లెకు పాదయాత్ర చేపట్టి ఈ నెల 26న మదనపల్లెలో 100 జాతీయ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని