logo

‘హీరో సినిమా విజయవంతం’

తమ మనవడు అశోక్‌ గల్లా తొలిసారి కథానాయకుడిగా నటించిన హీరో సినిమా విజయవంతమైందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమరరాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు తెలిపారు. తిరుపతి నగరంలోని డీఆర్‌మహల్‌ (ఎస్‌వీ సినిమాస్‌)లో శనివారం వారు కుటుంబసభ్యులతోపాటు

Published : 17 Jan 2022 03:13 IST


కేక్‌ కోస్తున్న గల్లా రామచంద్రనాయుడు, అరుణకుమారి

జీవకోన (తిరుపతి): తమ మనవడు అశోక్‌ గల్లా తొలిసారి కథానాయకుడిగా నటించిన హీరో సినిమా విజయవంతమైందని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమరరాజా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు తెలిపారు. తిరుపతి నగరంలోని డీఆర్‌మహల్‌ (ఎస్‌వీ సినిమాస్‌)లో శనివారం వారు కుటుంబసభ్యులతోపాటు సినిమా చూసిన థియేటర్‌ వద్ద కేక్‌ కోసి చిత్రం విజయంపై హర్షం వ్యక్తంచేశారు. అమరరాజా సంస్థ ఉత్పత్తులను ఏవిధంగా అయితే ఆదరిస్తున్నారో అదే ప్రేమతో హీరో చిత్రాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. అశోక్‌ నటన చాలా బాగుందని, రాబోయే చిత్రాల ద్వారా బాగారాణిస్తారని వారు ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ ద్వారా రాబోయే రోజుల్లో వైవిధ్యమైన చిత్రాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు చిత్రంలోని పాటలకు నృత్యాలు చేస్తూ అకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు