అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
ఆపై ఆత్మహత్యాయత్నం
పుత్తూరు: మద్యానికి భానిసై భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను గొంతుకోసి హత్య చేసిన సంఘటన పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పుత్తూరు రూరల్ సీఐ సురేష్‌కుమార్ కథనం మేరకు.. పుత్తూరు మున్సిపాలిటీలోని 2వ వార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన శేఖర్(33)కు అదే గ్రామానికి చెందిన వనజ(29)ను ఇచ్చి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి మేఘన(10), దిలీప్‌కుమార్(7) పిల్లలు. శేఖర్ మద్యానికి భానిసయ్యాడు. అదే సమయంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతికి ముందు రెండు రోజుల క్రితం వీరి మధ్య గొడవలు జరగడంతో అలిగి పిల్లలను తీసుకుని వనజ పుట్టింటికి వెళ్లిపోయింది. అమ్మ నచ్చచెప్పి శనివారం ఇంటికి పంపింది. ఇంటికి వెళ్లిన భార్యతో శేఖర్ గొడవ పెట్టుకున్నాడు. ఉలితో భార్య గొంతు కోశాడు. అతను ఒంటిపై గాయాలు చేసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడి ఇంటి ముందు పడిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా..అప్పటికే వనజ మృతి చెందింది. శేఖర్‌ను పుత్తూరు ఆస్పత్రికి తరలించారు.మృతిరాలి తల్లి రాణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పుత్తూరు రూరల్ సీఐ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.