logo

కొండచుట్టు.. ఆకట్టుకునేట్టు..

చంద్రగిరిలో సోమవారం సాయంత్రం కొండచుట్టు వైభవోపేతంగా నిర్వహించారు. తొలిసారిగా శ్రీమూలస్థానమ్మ, శ్రీధర్మనందనుల ఉత్సవర్లతో పాటు రాయలవారికోటలోని శ్రీముత్యాలమ్మ అశ్వ వాహనాలపై, ద్వారకానగర్‌లోని శ్రీమిట్టగంగమ్మ గజ వాహనంపై, భవానీనగర్‌లోని

Published : 18 Jan 2022 04:52 IST

చంద్రగిరిలో ఊరేగుతున్న దేవతామూర్తులు

చంద్రగిరిలో సోమవారం సాయంత్రం కొండచుట్టు వైభవోపేతంగా నిర్వహించారు. తొలిసారిగా శ్రీమూలస్థానమ్మ, శ్రీధర్మనందనుల ఉత్సవర్లతో పాటు రాయలవారికోటలోని శ్రీముత్యాలమ్మ అశ్వ వాహనాలపై, ద్వారకానగర్‌లోని శ్రీమిట్టగంగమ్మ గజ వాహనంపై, భవానీనగర్‌లోని శ్రీఅంకాళమ్మతల్లి పుష్పపల్లకీపై, రాయలపురంలోని శ్రీరేణుకా పరమేశ్వరి పుష్పతేరుపై చంద్రగిరిలోని బజారువీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో ఆలయాల ధర్మకర్తలు శివశంకర్‌రెడ్డి, మొక్కల చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, బాబిరెడ్డి, శంకర్‌రెడ్డి, ఉభయదాతలు పాల్గొన్నారు. డీఎస్పీ నరసప్ప బందోబస్తు పర్యవేక్షించారు. - న్యూస్‌టుడే, చంద్రగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని