logo

అర్బన్‌ పోలీసులకు జాతీయ పురస్కారాలు

తిరుపతి అర్బన్‌ పోలీస్‌ సైబర్‌ వింగ్‌కు ఉత్తమ జాతీయ సైబర్‌ పురస్కారం దక్కింది. అవార్డు, జ్ఞాపికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడుతోపాటు ఉన్నతాధికారులు సోమవారం అందుకున్నారు. నేషనల్‌ సైబర్‌

Published : 18 Jan 2022 04:52 IST

అవార్డుతో అర్బన్‌ ఎస్పీ, అదనపు ఎస్పీ, ఇతర అధికారులు

తిరుపతి(నేరవిభాగం): తిరుపతి అర్బన్‌ పోలీస్‌ సైబర్‌ వింగ్‌కు ఉత్తమ జాతీయ సైబర్‌ పురస్కారం దక్కింది. అవార్డు, జ్ఞాపికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడుతోపాటు ఉన్నతాధికారులు సోమవారం అందుకున్నారు. నేషనల్‌ సైబర్‌ అవార్డు-2021 నిమిత్తం గత నెల 3 నుంచి 5వ తేదీ వరకు హైదారాబాద్‌లో సైబర్‌ పోలీసింగ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ మీట్‌ 3.0 పోటీలను వర్చువల్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 748 జిల్లాల సైబర్‌ పోలీసులు పాల్గొని ఏడాది కాలంలో కేసుల ప్రగతిని సీఆర్‌సీఐడీఎఫ్‌కి నివేదించారు. పరిశీలించిన ఎంపిక కమిటీ తిరుపతి అర్బన్‌ సైబర్‌ బృందానికి ఉత్తమ జాతీయ సైబర్‌ పురస్కారాన్ని ప్రకటించింది. సైబర్‌ వింగ్‌ సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డికి బెస్ట్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేటర్‌ అవార్ఢు. అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడుకు బెస్ట్‌ సైబర్‌ క్రైమ్‌ టీమ్‌ మెంటార్‌ అవార్డు లభించాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అంకుఠిత దీక్ష, క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయడంతోనే సైబర్‌ వింగ్‌ అవార్డులు సొంతమయ్యాయని సిబ్బందిని ప్రశంసించారు. బాధ్యతగా సైబర్‌ కేసుల సాధనకు కృషి చేసినందుకు తనకొచ్చిన అవార్డును సైబర్‌ వింగ్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీ నాగసుబ్బన్న, సీఐలు సుబ్రహ్మణ్యం రెడ్డి, అబ్బన్న పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని