logo

31 వరకు రాత్రి కర్ఫ్యూ: కలెక్టర్‌

కొవిడ్‌ నియంత్రణ కు ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి ఉదయం ఐదు గంటల వరకు రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నామని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘రాత్రి కర్ఫ్యూలో వైద్య, మీడియా, కమ్యూనికేషన్‌, విద్యుత్తు,

Published : 18 Jan 2022 04:52 IST

హరినారాయణన్‌

చిత్తూరు(జిల్లా సచివాలయం, జడ్పీ): కొవిడ్‌ నియంత్రణ కు ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి ఉదయం ఐదు గంటల వరకు రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నామని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘రాత్రి కర్ఫ్యూలో వైద్య, మీడియా, కమ్యూనికేషన్‌, విద్యుత్తు, నీటిసరఫరా, పారిశుద్ధ్య విభాగాలు, పెట్రోల్‌ బంకులు, నిత్యావసరాల రవాణాకు మినహాయింపు ఉంది. మాస్కు లేకుండా జన సమూహంలోకి వెళ్తే రూ.100 జరిమానా తప్పదు. వివాహాలు, మతపరమైన వేడుకలకు బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, కల్యాణ మండపాల్లో వందమందికి అనుమతినిస్తున్నాం. నిబంధనల్ని పాటించని వ్యాపార యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తాం’ అని వివరించారు.

కొవిడ్‌ కేర్‌ ఇన్‌ఛార్జిగా జడ్పీ సీఈవో.. జిల్లాలో కొవిడ్‌ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ ఇన్‌ఛార్జిగా జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డిని నియమిస్తూ కలెక్టర్‌ హరినారాయణన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని