logo

నేను బతికే ఉన్నా

ఈ చిత్రంలోని పేద రైతు పేరు పుల్లగూర మల్లప్ప (70). ఆయనది పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లె పంచాయతీ పులగంటివారిపల్లె. ఆయన బతికుండగానే.. చనిపోయినట్లు ఖాతాను ఆన్‌లైన్‌లో ఇన్‌యాక్టివ్‌ చేశారు. దీనివల్ల పదో విడతలో రావాల్సిన రైతు

Published : 18 Jan 2022 04:52 IST

సిబ్బంది పొరపాటు.. అన్నదాతకు గ్రహపాటు

చనిపోయాడని రైతు భరోసా-పీఎం కిసాన్‌ రద్దు

ఈ చిత్రంలోని పేద రైతు పేరు పుల్లగూర మల్లప్ప (70). ఆయనది పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లె పంచాయతీ పులగంటివారిపల్లె. ఆయన బతికుండగానే.. చనిపోయినట్లు ఖాతాను ఆన్‌లైన్‌లో ఇన్‌యాక్టివ్‌ చేశారు. దీనివల్ల పదో విడతలో రావాల్సిన రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం డబ్బులను నిలుపుదల చేశారు. ఈ పల్లెలో ఇదే పేరు కలిగిన వ్యక్తి చనిపోవడంతో స్థానిక సిబ్బంది మల్లప్ప ఆధార్‌ కార్డు నంబరు వేసి అతని ఖాతాను ఇన్‌యాక్టివ్‌ చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన రైతు మల్లప్ప మాట్లాడుతూ తాను బతికే ఉన్నానని, న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఇదే నివేదికతో రేషన్‌ కార్డు, వృద్ధాప్య పింఛను రద్దు చేసి నోటికాడ కూడు లాగేస్తారేమోనని ఆయన భయపడుతున్నారు. ఎంపీడీవో గిరిధరరెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి బాధిత రైతుకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, పెద్దతిప్ప సముద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని