logo

కన్నెకేశ్వర గురుకుల్‌ కన్నుమూత

నాలుగున్నర దశాబ్దాలుగా శివయ్యకు అభిషేకాలు చేస్తూ ఆత్మానందాన్ని పొందిన స్థానం కన్నెకేశ్వర గురుకుల్‌(92) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఇటీవల విధులకు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్న ఆయన సోమవారం మరణించారు. 1930లో పుట్టిన

Published : 18 Jan 2022 04:52 IST

శ్రీకాళహస్తి: నాలుగున్నర దశాబ్దాలుగా శివయ్యకు అభిషేకాలు చేస్తూ ఆత్మానందాన్ని పొందిన స్థానం కన్నెకేశ్వర గురుకుల్‌(92) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఇటీవల విధులకు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్న ఆయన సోమవారం మరణించారు. 1930లో పుట్టిన ఆయన 1952లో చంద్రమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు. సతీమణి చంద్రమ్మతో పాటు కుమారుడు కుమారస్వామి గురుకుల్‌, కుమార్తెలు విజయ, గౌరీలు మరణించారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఆయన ఇక లేరంటూ కుటుంబీకులు సోమవారం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 45 ఏళ్లుగా ముక్కంటి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగస్వాములయ్యారు. ఆలయానికి ఆర్థిక పరిస్థితులు సరిగాలేని సమయాల్లోనే స్థానం కుటుంబీకులు ముక్కంటి ఆలయ అభివృద్ధికి సేవలందించారు. ఈయన మృతికి ఆలయ ఈవో పెద్దిరాజుతో పాటు పలువురు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని