logo

సందర్శనీయ స్థలం.. ఆదాయం ప్రశ్నార్థకం

జిల్లావాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన శిల్పారామానికి కరోనా కారణంగా నష్టం వాటిల్లింది. రెండేళ్లలో రూ.4 కోట్లకు పైగా నష్టపోయింది. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

Published : 18 Jan 2022 04:52 IST

శిల్పారామానికి రూ.4 కోట్ల నష్టం

ఏడు నెలలుగా జీతాలు లేని సిబ్బంది

జిల్లావాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన శిల్పారామానికి కరోనా కారణంగా నష్టం వాటిల్లింది. రెండేళ్లలో రూ.4 కోట్లకు పైగా నష్టపోయింది. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. - న్యూస్‌టుడే, తిరుచానూరు

శిల్పారామానికి ప్రవేశ టిక్కెట్ల రూపంలో ప్రతినెలా రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ప్రవేశ టిక్కెట్‌ ధర రూ.20 కాగా, బోటు షికారుకు రూ.30 చెల్లిస్తే ఒకరిని అనుమతిస్తారు. పర్వదినాలు, వరుస సెలవు రోజుల్లో సందర్శకుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. రెండేళ్లుగా కరోనా కారణంగా సందర్శకుల తాకిడి తగ్గుముఖం పట్టింది. దాంతో దుకాణాలు చాలా వరకు మూతపడ్డాయి. వీటి అద్దెల ద్వారా నెలకు రూ.రెండు లక్షల వరకు వచ్చే ఆదాయాన్ని కోల్పోయింది. కల్యాణ మండపం పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఏటా రూ.కోటి ఆదా యం లేకుండా పోయింది. ఇలా రెండేళ్లలో దాదాపు రూ.2 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది.

శిల్పారామంలో దాదాపు 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఏడు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు జీతాల కోసం ఉన్నతాధికారులను సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం లేదు. సిబ్బంది చిరుద్యోగులు కావడంతో జీతాలు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ‘రెండేళ్లుగా కరోనా తీవ్రత కారణంగా అత్యధిక రోజులు మూసివేయాల్సి రావడంతో సందర్శకుల సంఖ్య తగ్గింది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని శిల్పారామం పరిపాలనాధికారి ఖాదర్‌వలి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని